జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు..హాజరైన వేలాది అభిమానులు .

అమెరికాలో ఓ పోలీసు చేతిలో హతుడైన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు వేలాది అభిమానుల మధ్య హూస్టన్ లో జరిగాయి. ఫౌంటెయిన్ ఆఫ్ ప్రైస్ చర్చి వద్ద ఆయన తల్లి సమాధి వద్దే..

జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు..హాజరైన వేలాది అభిమానులు .
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2020 | 3:05 PM

అమెరికాలో ఓ పోలీసు చేతిలో హతుడైన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు వేలాది అభిమానుల మధ్య హూస్టన్ లో జరిగాయి. ఫౌంటెయిన్ ఆఫ్ ప్రైస్ చర్చి వద్ద ఆయన తల్లి సమాధి వద్దే ఆయనను ఖననం చేశారు. ఈ అంత్యక్రియలకు జార్జి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. దాదాపు ఆరున్నవేల మంది ఈ అంత్యక్రియలకు వఛ్చి బారులు తీరినప్పటికీ.. కొన్ని వందలమందిని మాత్రమే అనుమతించారు. ఓ గుర్రపు శకటంలో  జార్జి మృతదేహంతో కూడిన పేటికను   దాదాపు నాలుగు గంటలపాటు ఊరేగించారు. అనేకమంది జార్జ్ జార్జ్ అంటూ నినాదాలు చేశారు. అతని చిత్రపటం కింద అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కొన్ని వాక్యాలు రాయడం విశేషం. హైస్కూలులో చదువుతుండగా జార్జ్ రైజింగ్ స్టార్ అథ్లెట్ అని, అందరినీ కలుపుకుని పోయే కుటుంబ సభ్యుడవంటి వాడని పేర్కొన్నారు. ఈ అంత్య క్రియలకు ఒక రోజు ముందు.. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్.. జార్జి కుటుంబ సభ్యులను పరామర్శించి చేసిన  ప్రీ-రికార్డెడ్ సందేశాన్ని కూడా ఈ అంత్యక్రియల సందర్భంగా ప్రదర్శించారు.