కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్​ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *