తీవ్రదాదుల కుట్ర భగ్నం

త్రిపురలో తీవ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అగర్తాలా రైల్వే స్టేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. వారి నుంచి 5 రివాల్వర్లతో పాటు, భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు అసోంలో NDBF ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. కోక్రాజార్ జిల్లాలో సైన్యం పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఈ ఉగ్రవాది పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి ఏకే-56 రూఫిల్‌తో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన సైన్యం తాజాగా ఈ ఉగ్రవాదిని పట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *