బాలాపూర్ రికార్డులు అధిగమించిన ఫిలింనగర్ లడ్డూ!

Film Nagar Ganesh Laddu Breaks the cost of Balapur Laddu, బాలాపూర్ రికార్డులు అధిగమించిన ఫిలింనగర్ లడ్డూ!

గణపతి లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డు నెలకొంది. బాలాపూర్‌ లడ్డూనీ మించిపోయిన వినాయక్‌ నగర్‌ లడ్డూ. లడ్డూ వేలం పాటలో గత ఏడాది నగరంలో రెండో స్థానంలో నిలిచిన ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌ బస్తీ గణపతి లడ్డూ ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. వినాయక్‌నగర్‌ బస్తీలోని గణపతి లడ్డూను రూ.17.75 లక్షలకు బీజేపీ నేత పల్లపు గోవర్ధన్‌ కైవసం చేసుకున్నారు. ఈ వినాయక్‌నగర్‌ గణపతి లడ్డూ గత ఏడాది రూ. 15.1 లక్షల ధర పలికింది.

ఇవాళ ఉదయం బాలాపూర్ కూడలిలో జరిగిన వేలం పాటలో రూ. 17 లక్షల 60 వేలకు కొలను రాంరెడ్డి.. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లింగాల కొలను రాంరెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. తొలిసారి బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు కొలను రాంరెడ్డి. గతేడాది ఈ లడ్డూ రూ. 16.60 లక్షలకు శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాటలో మొత్తం 19 మంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *