AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!  

దీపావళి టపాసుల తయారీకి పేరొందింది తమిళనాడులోని శివకాశి పట్టణం! దేశంలోని వ్యవస్థీకృత బాణసంచా పరిశ్రమలో దాదాపు 85 శాతం వాటా ఈ ఒక్క పట్టణానిదే. ఇక్కడి నుంచే వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. శివకాశీలో చిన్న అగ్గిపెట్టెల తయారీ యూనిట్‌గా మొదలైన ఒక సంస్థ రూ.300 కోట్ల ఆదాయం సాధించే స్థాయికి ఎదిగింది. ఎనిమిది దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న ఆ కంపెనీ పేరే స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్.

చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!  
From Matchboxes To Fireworks How Standard Fireworks Built A Rs 277 Crore Business
Sharada V
|

Updated on: Nov 08, 2026 | 12:51 PM

Share

స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్ కథ 1942లో ప్రారంభమైంది. రాజరత్నం ఈ సంస్థకు పునాది వేశారు. అప్పట్లో అది బాణసంచా ఫ్యాక్టరీ కాదు ఒక చిన్న అగ్గిపెట్టెల తయారీ యూనిట్ మాత్రమే. ఆ తర్వాత మార్కెట్ అవసరాలను గుర్తిస్తూ క్రమంగా బాణసంచా తయారీ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తూ, తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ సంస్థను విస్తరించారు.

ప్రస్తుతం ఈ కంపెనీ స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్ పేరుతో కొనసాగుతోంది. 1977లో ప్రస్తుత కంపెనీ చట్టబద్ధంగా నమోదైంది. ఇది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాని ప్రైవేట్ సంస్థ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.277 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అందుకే ఈ కంపెనీ ప్రయాణం ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

చిచ్చుబుడ్ల నుంచి తారాజువ్వల వరకు

ఒకప్పుడు అగ్గిపెట్టెల తయారీకి పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు అనేక రకాల బాణసంచా ఉత్పత్తులను తయారు చేస్తోంది. చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పూల కుండీలు, రాకెట్లు, ఫ్యాన్సీ క్రాకర్స్‌తో పాటు ఆకాశంలో భారీగా రంగులు విరజిమ్మే బాణసంచా కూడా దీని ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి. మల్టీషాట్ ఫైర్‌వర్క్స్, కొత్త తరహా వినోద ఉత్పత్తులనూ తయారు చేస్తోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తుల పరిధిని పెంచుకుంటూ మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రయాణంలో ఎన్నో మార్పులు వచ్చినా బాణసంచా తయారీనే ప్రధాన వ్యాపారంగా కొనసాగిస్తోంది.

 దేశ బాణసంచా రాజధానిగా శివకాశి

స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్ ఎదుగుదల వెనుక శివకాశి పారిశ్రామిక చరిత్ర కూడా ఉంది. ఈ పట్టణంలో అగ్గిపెట్టెల తయారీకి 20వ శతాబ్దం ప్రారంభంలోనే పునాది పడింది. అయ్యా నాడార్, షణ్ముగ నాడార్ అనే వ్యాపారులు కలకత్తాలో అగ్గిపెట్టెల తయారీ పద్ధతులను నేర్చుకుని తమిళనాడుకు తిరిగి వచ్చారు. అక్కడ నేర్చుకున్న నైపుణ్యంతో స్థానికంగా సేఫ్టీ మ్యాచెస్ తయారీని ప్రారంభించారు. అలా శివకాశిలో ఒక కొత్త పరిశ్రమకు బీజం పడింది.

ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పరిస్థితులు మారాయి. విదేశాల నుంచి బాణసంచా దిగుమతులపై ఆంక్షలు విధించడంతో భారతీయ తయారీదారులకు కొత్త అవకాశాలు లభించాయి. టపాసులను స్థానికంగానే తయారు చేయడం ప్రారంభించారు. దీంతో శివకాశిలో బాణసంచా తయారీ వేగంగా విస్తరించింది. స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్‌తో పాటు నేషనల్ ఫైర్‌వర్క్స్, కలిస్వరి ఫైర్‌వర్క్స్ గుర్తింపు తెచ్చుకున్నాయి. శివకాశి అభివృద్ధికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. బాణసంచా తయారీలోని కొన్ని దశలకు అనుకూలమైన వేడి వాతావరణం లభించడం కారణం. దీంతో చిన్న పట్టణం కాస్తా దేశంలోనే అతిపెద్ద బాణసంచా తయారీ కేంద్రంగా మారింది.

1,070కి పైగా ఫ్యాక్టరీలు 3 లక్షల మందికి ఉపాధి!

2026 నాటికి శివకాశిలో 1,070కి పైగా లైసెన్స్ పొందిన బాణసంచా తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమ వార్షిక వ్యాపారం దాదాపు రూ.7,000 కోట్లు. ప్రత్యక్షంగా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడి పరిశ్రమ టపాసుల తయారీకే పరిమితం కాలేదు. బాణసంచా తయారీకి అవసరమైన రసాయనాల సరఫరా, ప్యాకేజింగ్, ప్రింటింగ్, రవాణా, హోల్‌సేల్ వ్యాపారం వంటి అనేక రంగాలు కూడా అభివృద్ధి చెందాయి. వీటిపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. దీపావళి సమయంలో బాణసంచాకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ ఒక్క పండుగ కోసం నెలల ముందే తయారీ, ప్యాకింగ్, సరఫరా పనులు ఊపందుకుంటాయి. అందుకే శివకాశి ఆర్థిక వ్యవస్థలో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది.

ధరల పెరుగుదల నుంచి నిబంధనల వరకు సవాళ్లు

వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పటికీ శివకాశి బాణసంచా పరిశ్రమకు సవాళ్లు లేకపోలేదు. సంప్రదాయ టపాసులపై ఆంక్షలు, గ్రీన్ క్రాకర్స్‌కు సంబంధించిన నిబంధనలు, ఫ్యాక్టరీల భద్రతా ప్రమాణాలు తయారీదారులకు పెద్ద సవాలుగా మారాయి. నిబంధనల కారణంగా కొన్ని సందర్భాల్లో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోంది. ఈ ఏడాది ముడిసరుకు ధరలు పెరగడం, కార్మికుల కొరత, అకాల వర్షాలు, బాణసంచా తయారీలో ఉపయోగించే అల్యూమినియం పొడి, రసాయనాల ధరల పెరుగుదలతో తయారీ ఖర్చులు పెరిగాయి.

కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు

శివకాశి తయారీదారులు విదేశీ మార్కెట్లపైనా దృష్టి సారిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేయగలిగితే శివకాశికి ప్రపంచ మార్కెట్‌లో మంచి అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే, పరిశ్రమను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉత్పత్తుల నాణ్యత పరీక్షలు, ధ్రువీకరణ, పరిశోధన, ఆటోమేషన్, కార్మికులకు శిక్షణ అందించే కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

చిన్న అగ్గిపెట్టెల నుంచి రూ.277 కోట్ల స్థాయికి

1942లో ఒక చిన్న అగ్గిపెట్టెల తయారీ యూనిట్‌గా ప్రారంభమైన స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్.. నేడు రూ.277 కోట్ల వార్షిక ఆదాయం సాధించే స్థాయికి చేరింది. ఈ ప్రయాణం వెనుక ఎనిమిది దశాబ్దాల కృషి, మారుతున్న మార్కెట్‌కు అనుగుణంగా వ్యాపారాన్ని విస్తరించడం ఉన్నాయి. శివకాశి పట్టణం అగ్గిపెట్టెల తయారీ కేంద్రం నుంచి దేశ బాణసంచా పరిశ్రమకు గుండెకాయగా ఎదిగింది.

Follow Us
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్
చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్
చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!
చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!
నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. కడుపునిండా తినేస్తారు!
నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. కడుపునిండా తినేస్తారు!
తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!
తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!
ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు
ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు
రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!
రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!
నీటి చుక్క పడగానే వెలిగే దీపం..కరెంట్ లేకుండానే ఎలా పని చేస్తుంది
నీటి చుక్క పడగానే వెలిగే దీపం..కరెంట్ లేకుండానే ఎలా పని చేస్తుంది