వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బయటి వాతావరణంలో పనిచేసేవారు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఉదాహరణకు, మ్యాట్ అమ్మకందారులు ఉదయం 10:30 లేదా 11:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఎండలో కూర్చొని పనిచేయాల్సి వస్తుంది. జీవనం కోసం ఈ శ్రమ తప్పనిసరి. నిరంతరం చెమట పట్టడం వల్ల శరీరం నుండి నీటితో పాటు ఎలెక్ట్రోలైట్స్ కూడా కోల్పోతారు. ఇది శారీరక అలసట, బలహీనతకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, వారు తరచుగా హైడ్రేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. ప్రతి పది నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉంటారు. అంతేకాకుండా, మజ్జిగను తయారుచేసుకొని తాగడం, కొబ్బరి బోండాలు తాగుతుంటారు. ఇవి కానిపక్షంలో ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా రోజంతా ఎండలో పనిచేయడానికి అవసరమైన శక్తిని పొందుతారు.