మా హీరోను వదిలేయండి ప్లీజ్..

Chiranjeevi in bjp, మా హీరోను వదిలేయండి ప్లీజ్..

ఈ మధ్యబాగా వినిపిస్తున్నమాట మెగాస్టార్ చిరంజీవి మళ్లీ  రాజకీయాల్లోకి వస్తారని.. కానీ ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఆయన అభిమానులు మాత్రం తెగ బాధపడిపోతున్నారట. దయచేసి మా హీరోను వదిలేయండని వేడుకుంటున్నారట. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే పాలిటిక్స్‌లోకి ఎంటరై ప్రజారాజ్యం పార్టీని స్ధాపించారు. 2009 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కృషిచేశారు. కానీ కాలం కలిసిరాలేదు. 18 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఆతర్వాత రాజకీయ పరిణామాల నేపధ్యంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసి కేంద్రంలో మంత్రి పదవిని కూడా అలంకరించారు చిరంజీవి.

రాజకీయాలు కలిసిరాకపోవడంతో గత కొద్దికాలంగా దూరంగా ఉంటున్నారు చిరంజీవి. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి మూవీతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గతంలో తిన్న ఎదురుదెబ్బల ద‌ృష్ట్యా చిరు ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రావద్దని, ముఖ్యంగా బీజేపీలోకి వెళ్లొద్దంటూ మెగా ఫ్యాన్స్ విఙ్ఞప్తి చేస్తున్నారట. తమ హీరో కొందరివాడు కాదని.. అందరివాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొంతమంది బీజేపీ నేతలు సైతం చిరంజీవి తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఇప్పటికే స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. మరి చిరు సినిమాల్లో కంటిన్యూ అవుతారా? లేక మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తారా అనేది తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *