ప్రముఖ నటి జరీనాకు కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌లో మరో నటి కరోనా బారిన పడ్డారు. ప్రముఖ నటి జరీనా వహాబ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారం క్రితం

  • Publish Date - 7:36 am, Wed, 23 September 20 Edited By:
ప్రముఖ నటి జరీనాకు కరోనా పాజిటివ్‌

Zarina Wahab Corona: బాలీవుడ్‌లో మరో నటి కరోనా బారిన పడ్డారు. ప్రముఖ నటి జరీనా వహాబ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారం క్రితం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు జ్వరం, శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఉండటంతో వైద్యులు చికిత్స అందించారు. ఐదు రోజులకే జరీనా ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఆమెకు ఇంకా నెగిటివ్ రాలేదు. ప్రస్తుతం జరీనా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా పలు భారతీయ భాషల్లో వందలకు పైగా చిత్రాల్లో జరీనా నటించారు. చివరగా వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ హీరోయిన్లుగా నటించిన స్ట్రీట్ డ్యాన్సర్ 3లో కనిపించారు. ప్రస్తుతం తెలుగులో వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న విరాటపర్వంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మావో కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

Read More:

Bigg Boss 4: ఇంప్రెస్ అయిన మోనాల్.. జోష్ పెంచిన అవినాష్

Breaking News : ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌ చేయాలి