Zareen Khan: అతను నాకు మంచి స్నేహితుడు.. ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ..

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో మంది హీరోయిన్లను హిందీ చిత్ర సీమకు పరిచయం చేశారు. అందులో హాట్ బ్యూటీ జరీనా ఖాన్ ఒకరు. సల్మాన్ హీరోగా నటించిన ' వీర్' సినిమాతో ఈ ముద్దుగుమ్మ వెండితెరకు పరిచయమైంది

Zareen Khan: అతను నాకు మంచి స్నేహితుడు.. ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ..
Zareen Khan

Edited By:

Updated on: Jan 21, 2022 | 9:02 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో మంది హీరోయిన్లను హిందీ చిత్ర సీమకు పరిచయం చేశారు. అందులో హాట్ బ్యూటీ జరీనా ఖాన్ ఒకరు. సల్మాన్ హీరోగా నటించిన ‘ వీర్’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ వెండితెరకు పరిచయమైంది.  ఆ సినిమా సరిగా ఆడలేకపోయినప్పటికీ బాగనే సినిమా ఛాన్సులు దక్కించుకుంది.  గోపిచంద్ తో కలిసి  ‘చాణక్య’ సినిమాతో టాలీవుడ్ ను కూడా పలకరించింది. కాగా ప్రస్తుతం సినిమాలతో స్పెషల్ సాంగ్ ల్లోనూ నటిస్తోన్న ఈ  అందాల తార తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తన జీవితంలో సల్మాన్ కు ఉన్న ప్రాధాన్యాన్ని అభిమానులతో పంచుకుంది.

‘సల్మాన్‌తో కలిసి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమవ్వడం నా అదృష్టం. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ సులభంగా వచ్చినప్పటికీ ఆ తర్వాత నా సినీ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు.  సల్మాన్  వల్లనే నేను ఇక్కడ  ఉంటున్నానని చాలామంది భావిస్తున్నారు. వారు అనుకున్నట్లే ఆయన  అద్భుతమైన వ్యక్తి.  తోటివారికి చేతనైన సహాయం చేస్తారు . అయితే అతడితో సన్నిహితంగా ఉంటే అన్ని పనులు అయిపోతాయని అందరూ భావిస్తారు. కానీ, అది  వాస్తవం కాదు.  నా విషయానికి వస్తే.. చిన్న  చిన్న విషయాలను అతడిని అడగను. నాకు సల్మాన్ మంచి స్నేహితుడు. అతను ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నా ప్రతిసారి ఫోన్ చేయను’ అని జరీన్ తెలిపింది. కాగా చూడడానికి అచ్చం కత్రినా లాగే ఉంటుందీ అందాల తార. మరోవైపు కత్రినాను కూడా సల్లూభాయ్ నే సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..

Viral Photos: ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని ఈ అందమైన ప్రదేశాలను చూడవచ్చు.. ఎలాగంటే..?

Massive 555-Carat Black Diamond: ఆకాశంలోంచి ఊడిపడిన బ్లాక్ డైమండ్.. అతి పెద్ద నల్ల వజ్రం స్పెషాలిటీ ఏంటంటే..(వీడియో)