మజిలీ, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశాడు సుహాస్. ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా మారిన సుహాస్ తొలి చిత్రంతోనే ఇండస్ట్రీని షేక్ అయ్యేలా చేశాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. హిట్-2 చిత్రంలో విలన్‌గా కనిపించి తనలోని నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇతక తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ చిత్రంతో తొలి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. సుహాస్ నటన, సినిమా కథ పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుందీ సినిమా. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న చిత్రం లాభాల బాట పట్టింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా చేరువైంది. సినిమా మంచి విజయం అందుకున్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాను ఉచితంగా ప్రదర్శించాలని డిసైడ్ అయ్యింది. ఫిబ్రవి 8వ తేదీన ఎంపిక చేసిన థియేటర్లలో రైటర్ పద్శభూషణ్ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు.
అయితే కేవలం మహిళల కోసమే ఉచితంగా ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 38 థియేటర్‌లలో నాలుగు షోలలో మహిళలు ఉచితంగా సినిమాను చూడొచ్చు. ఇదిలా ఉంటే ఆ థియేటర్‌ల జాబితాను చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. చిత్ర యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా ప్రేక్షకులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికాసేపట్లో థియేటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రైటర్ పద్మభూషణం ఓవర్‌సీస్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..