విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తమిళ రీమెక్ ‘వర్మ’తో హీరోగా పరిచయమయ్యాడు హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. తాజాగా ధ్రువ్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ఇందులో ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడాకారుడిగా ఎదిగి.. చివరకు దేశం అత్యున్నత క్రీడా గౌరవాన్ని గెలుచుకోనున్న ఓ క్రీడాకారుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆసియా క్రీడలతో భారత దేశానికి గోల్డ్ మేడల్ సాధించిన కబడ్డీ ఆటగాడి నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు పా.రంజిత్ నిర్మాణ సంస్థ అయిన నీలం ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతుంది.
Also Read:
ఎవరు మా ఇంటికి రావొద్దు.. ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో.. అసలు కారణం ఎంటంటే ?