actor Thavasi Cancer: తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ కమెడియన్ తపసి క్యానర్స్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో అతడు సన్నగా గుర్తుపట్టనంతగా మారిపోయాడు. ఈ క్రమంలో తన తండ్రికి ఆర్థిక సాయం చేయాలంటూ అతడికుమారుడు అరుముగన్ సోషల్ మీడియాలో అభ్యర్థించాడు. ఈ క్రమంలో పలువురు ముందుకొస్తున్నారు. (మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుతున్న నటుడు.. ట్యూన్స్ రెడీ చేస్తున్నాడా..!)
ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవనన్, తవసిని తన ఆసుపత్రిలో చేర్పించుకున్నారు. అతడికి ఉచిత చికిత్స అందిస్తామని తెలిపారు. మరోవైపు హీరో శివకార్తికేయన్ రూ.25వేలు ఇవ్వగా.. కమెడియన్ సూరీ రూ.20వేలు ఆర్థిక సాయం చేశారు. ఇక తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి లక్ష రూపాయలను తపసికి ఇచ్చారు. అలాగే నటుడు సౌందర్‌రాజా రూ.10వేలు ఇచ్చారు. మరోవైపు ఆయన అభిమానులు తపసి త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నారు. (మైనర్‌తో లైంగిక సంబంధం.. ఒలింపిక్ విజేతపై కేసు నమోదు.. దోషిగా తేలితే..!)