కుమారుడిపై విజయ్ సేతుపతి పిడిగుద్దులు

కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తన కుమారుడు సూర్య విజయ్‌పై పిడిగుద్దులు కురిపించాడు. సూర్య చెయ్యిని ఒడిసి పట్టుకొని సినిమాల్లో విలన్‌ను కొట్టినట్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఏంటి విజయ్ నిజంగానే తన కుమారుడిని అంతలా కొట్టారా అనుకుంటున్నారా..! అదేం లేదండి సెట్‌లో సూర్యతో విజయ్ సరదాగా ఆడుకున్నాడు. Father – Son fun on the sets of #Sindhubaadh#VijaySethupathi #SuriyaVijaySethupathi ?? pic.twitter.com/Rt6r29l35a — Kaushik LM (@LMKMovieManiac) […]

కుమారుడిపై విజయ్ సేతుపతి పిడిగుద్దులు

Edited By:

Updated on: Mar 19, 2019 | 2:49 PM

కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తన కుమారుడు సూర్య విజయ్‌పై పిడిగుద్దులు కురిపించాడు. సూర్య చెయ్యిని ఒడిసి పట్టుకొని సినిమాల్లో విలన్‌ను కొట్టినట్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఏంటి విజయ్ నిజంగానే తన కుమారుడిని అంతలా కొట్టారా అనుకుంటున్నారా..! అదేం లేదండి సెట్‌లో సూర్యతో విజయ్ సరదాగా ఆడుకున్నాడు.

విజయ్ ప్రస్తుతం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘సింధుబాద్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అంజలి, లింగా, రాజరాజన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ కుమారుడు సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా సరదాగా తన కుమారుడితో ఆడుకున్నాడు విజయ్. వీడియో చివర్లో తన కుమారుడికి ముద్దు పెట్టి ప్రేమను చూపించాడు. కాగా ‘సింధుబాద్’ అరుణ్ కుమార్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం. ఈ కాంబోలో ఇదివరకు వచ్చిన ‘పన్నైయారుమ్ పద్మినీయుమ్’, ‘సేతుపతి’ చిత్రాలు మంచి విజయం సాధించడంతో సింధుబాద్‌పై కోలీవుడ్‌లో చాలా అంచనాలు ఉన్నాయి. మరోవైపు సూర్య ఇప్పటికే ‘నానుమ్ రౌడీదాన్’, ‘జుంగా’ చిత్రాలతో తమిళ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.