బన్నీకి ‘రౌడీ’ స్పెషల్ గిఫ్ట్‌.. థ్యాంక్స్ చెప్పిన స్టైలిష్ స్టార్‌

టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్‌, విజయ్ దేవరకొండల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

బన్నీకి రౌడీ స్పెషల్ గిఫ్ట్‌.. థ్యాంక్స్ చెప్పిన స్టైలిష్ స్టార్‌

Updated on: Sep 06, 2020 | 7:35 PM

Vijay Gift to Bunny: టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్‌, విజయ్ దేవరకొండల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు కార్యక్రమాల్లో ఈ ఇద్దరు కలిసి కనిపించి, ఫ్యాన్స్‌కి కనువిందు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక గిఫ్ట్‌ను పంపారు. తన బ్రాండ్ ‘రౌడీ’ నుంచి లేటెస్ట్ కలెక్షన్‌ని అల్లు అర్జున్‌కి గిఫ్ట్‌గా పంపారు విజయ్‌. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ.. విజయ్‌కి థ్యాంక్స్ చెప్పాడు. కాగా అందులో ఒక షాట్‌, షర్ట్‌, మాస్క్‌లు ఉన్నాయి. ఇక బన్నీ ఫొటోకు.. ”బన్నీ అన్న.. వీటితో కిల్లర్‌ లుక్‌లో నువ్వు చంపేస్తావు” అని కామెంట్ పెట్టారు.

కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్‌లో నటిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటించనున్నారు. ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారు.

Read More:

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

కరోనాకు ఎక్కడైనా చికిత్స ఒకటే: మంత్రి ఈటెల

Loading...
Unable to load recommendations.
Follow Us