బాలయ్య సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

|

May 10, 2019 | 1:19 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాంప్ పాత్రలో యంగ్ హీరోయిన్ నటించబోతోందని సమాచారం. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ ఈ చిత్రంలో ప్రతినాయకురాలి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా జగపతి బాబు నటించబోతున్నాడు. ‘లెజెండ్’ సినిమా తర్వాత బాలకృష్ణ, జగపతి బాబు కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. బాలీవుడ్ […]

బాలయ్య సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?
Follow us on

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాంప్ పాత్రలో యంగ్ హీరోయిన్ నటించబోతోందని సమాచారం. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ ఈ చిత్రంలో ప్రతినాయకురాలి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా జగపతి బాబు నటించబోతున్నాడు. ‘లెజెండ్’ సినిమా తర్వాత బాలకృష్ణ, జగపతి బాబు కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై  సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నారు. మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుండగా.. జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.