NTR Tests Corona Negative: కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. విల్ పవరే ఆయుధమంటూ ట్వీట్..

తారక్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనా నుంచి ఎన్టీఆర్‌ పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది..

NTR Tests Corona Negative: కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. విల్ పవరే ఆయుధమంటూ ట్వీట్..
Jr.ntr

Updated on: May 25, 2021 | 3:26 PM

తారక్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనా నుంచి ఎన్టీఆర్‌ పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తారక్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులకు వెల్లడించాడు. తాను కోలుకోవాలని కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో సహకారాన్ని అందించిన డాక్టర్లు, శ్రేయోభిలాషులు అందరికి ధన్యవాదాలు తెలిపాడు. కరోనాను తేలికగా తీసుకోవద్దని.. అయితే సరైన జాగ్రత్తలతో పాటు సనుక్లుల ఆలోచనలతో ఉంటే కరోనాను ఓడించవచ్చునని తారక్ అన్నాడు. విల్ పవరే కరోనాను ఓడించగలిగే ఆయుధమని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.

ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా అప్‌డేట్…

ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాపై తాజాగా  అప్‌డేట్ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా కియారా నటించబోతుందట. ఇప్పటికే ఈ సినిమాకు కియారా ఓకే చెప్పినట్లుగా సమాచారం. అంతేకాదు.. మొదటి షెడ్యూల్ ప్రారంభమైనప్పుడే ఆమె షూటింగ్‌లో పాల్గోనబోతున్నట్లుగా టాక్. ఈ సినిమా ఏప్రిల్ 22, 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు కొరటాల శివ.

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!

Loading...
Unable to load recommendations.
Follow Us