Dongalunnaru Jagratha: మరో థ్రిల్లర్ కథతో రానున్న శ్రీ సింహ.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్ పూర్తి

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. మత్తువదలరా సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో.. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు.

Dongalunnaru Jagratha: మరో థ్రిల్లర్ కథతో రానున్న శ్రీ సింహ.. దొంగలున్నారు జాగ్రత్త షూటింగ్ పూర్తి
Sri Simha

Updated on: Jun 01, 2022 | 8:16 AM

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీసింహ(Sri Simha Koduri) హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. మత్తువదలరా సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో.. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆతర్వాత తెల్లవారితే గురువారం అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త'(Dongalunnaru Jagratha). డిఫరెంట్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘దొంగలున్నారు జాగ్రత్త’ తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం కావడం విశేషం.

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్సెలో ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపించారు. సెట్‌ను సిద్ధం చేయడంతో పాటు, కస్టమ్-మేడ్ కారును కూడా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో చివర్లో  శ్రీ సింహ కోడూరి ఎంట్రీ ఇచ్చారు.
72 మంది టీంతో 342 గంటల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారని మేకర్స్ వెల్లడించారు. అలాగే సింగల్ లొకేషన్ లో షూట్ చేశారు. సినిమా కథాంశానికి వస్తే..  ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తీరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.