
దొరసాని (Dorasani) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda). ఈ సినిమా ఆశించినంతగా హిట్ కాకపోయిన నటనపరంగా ఆనంద్ దేవరకొండ మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో ఆనంద్ హీరోగా సక్సెస్ అయ్యాడు. దొరసాని సినిమా తర్వాత ఆనంద్.. మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం (Pushpaka Vimanam) వంటి చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు ఈ యంగ్ స్టార్. ఇక ఇదే క్రమంలో ఆనంద్ మరోసారి కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు.
తాజాగా తన కొత్త చిత్రాన్ని సోమవారం ప్రకటించారు.. ఈ సినిమాకు గం.. గం.. గణేశా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తన తాజా సినిమా “గం..గం..గణేశా”ను సోమవారం లాంచ్ చేశారు. హై-లైఫ్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిన్న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాతలు కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి దర్శకుడు ఉదయ్ శెట్టి కి స్క్రిప్ట్ అందించారు. ఈ కార్యక్రమంతో పాటు తాజాగా విడుదల చేసిన “గం..గం..గణేశా” సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్ అని పోస్టర్ మీద రాయడం, టైటిల్స్ లో గన్స్ డిజైన్ చేయడం చూస్తుంటే ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఆనంద్ ఇప్పటిదాకా చేయని యాక్షన్ జానర్‌ను ఈ చిత్రంతో టచ్ చేయబోతున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాయికతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Also Read: Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు