దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చేపట్టి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం యాత్ర. దర్శకుడు మహివి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యాత్ర సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 5 ఏళ్లు అవుతుంది. యాత్ర సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఇక ఇప్పుడు యాత్ర 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 8న యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యింది. యాత్ర 2లో ఏపీ ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొని సంఘటనలో ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు మహివీ రాఘవ్. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా చూసిన వారందరూ మహివీ రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.
ఇక ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి. మొదటి షో తోనే యాత్ర 2 సినిమాకు హిట్ టాక్ వచ్చింది. నైజాం 0.20 కోట్లు, సీడెడ్ 0.30 కోట్లు, ఆంధ్ర(టోటల్) 0.15 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 0.65 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 కోట్లు, ఓవర్సీస్ 0.18 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 0.98 కోట్లు వసూల్ చేసింది యాత్ర 2 సినిమా.
యాత్ర 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 2.20 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 నుండి 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.98 కోట్ల షేర్ ను రాబట్టింది. అలాగే యాత్ర 2 సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.7.02 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
కడపోడు సార్ ! 🔥🔥🔥
కడపోళ్ళకి ఈ యండలు కష్టాలు కొత్త ఏమీకాదు
స్వతహాగా దేనిని అయినా ఓర్చుకునే శక్తి వాళ్ళకి ఎక్కవ @INCIndia #Yatra2 #YSJaganAgain 🙏🏻— srikanth reddy (@MSRaghavareddy) February 8, 2024
#Yatra2
Cinema bagundi ok ,but aa movie lo nijam entha abadam entha 🤣🫠— Nithya_Hari ⚓ (@Hail_Ntr_) February 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.