
పాన్ ఇండియా స్టార్ హీరోలలో రాకింగ్ స్టార్ యశ్ ఒకరు. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో ఓ రేంజ్‌లో సంచలనం సృష్టించిన యశ్, చాలా గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే విపరీతమైన హైక్ నెలకొంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టీజర్ నెట్టింట ఏ స్థాయిలో సంచలనం క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. మరోవైపు మూవీ పై టీజర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ శనివారం సాయంత్రం రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం తెలుగు ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రైలర్ ఆద్యంతం అత్యంత డార్క్, విజువల్లీ రిచ్ అండ్ వయలెంట్ అట్మాస్ఫియర్‌తో సాగింది. “దిస్ వాస్ సపోజ్డ్ టు బి మై ఫెయిరీ టేల్” అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ట్రైలర్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. యష్ మాస్ అండ్ స్టైలిష్ అవతార్‌తో మరోసారి సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. భారీ గన్ ఫైట్స్, అగ్నిప్రమాదాలు, సర్కస్ బ్యాక్‌డ్రాప్, స్నో లాండ్‌స్కేప్స్‌తో కూడిన సన్నివేశాలు సినిమా మేకింగ్ అంశాలు కనిపిస్తున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
ఈ సినిమాలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. ప్రతి ఒక్కరి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, డిఫరెంట్ షేడ్స్‌తో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ సినిమా రేంజ్‌ను మరింత పెంచాయి. మొత్తానికి ‘టాక్సిక్’ ట్రైలర్ సినీ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌గా నిలిచింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
ముఖ్యంగా ఈ చిత్రంలో కియారా యాక్టింగ్, గ్లామరస్ లుక్స్ పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే లేడీ విలన్ డాన్ గా నయనతార మాస్ హీరోయిన్ గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్ట్ 26న దాదాపు 40కు పైగా భాషలలో రిలీజ్ చేయనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..