
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. వెండితెరపై చరణ్.. తారక్ స్నేహాన్ని చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. మార్చి 25న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాస్తూ దూసుకుపోతుంది. ఇందులో చరణ్.. అల్లురీ సీతారామరాజుగా.. తారక్.. గోండు వీరుడు కొమురం భీంగా నటించి మెప్పించారు. తారక్.. చరణ్ నటనకు సినీ విశ్లేషకులు.. సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. విడుదలకు ముందే ప్రీమియర్ రికార్డ్స్ బద్దలు కొట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు చేస్తూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇందులో చరణ్.. తారక్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. తారక్.. చరణ్ స్నేహాన్ని వెండితెరపై చూసి మురిసిపోతున్నారు. అయితే ఈ మూవీలో ఓ సీన్ చూసి అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
అదే తారక్.. చరణ్ ఫైట్ సీన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు.. సెలబ్రెటీలు.. ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. స్నేహానికి ప్రాణమిచ్చే కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ జీవించేశారు. తెరపై కొన్ని సన్నివేశాల్లో తారక్ అమాయకత్వం.. చరణ్‌తో కలిసి చేసే పోరాట సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పుకోవాలి. ఇక కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తోంది. ఆ పాటలో చరణ్ ఎన్టీఆర్‌ను కొడుతుంటే.. థియేటర్లలో ప్రేక్షకుల కళ్లు చెమర్చుతున్నాయి. చరణ్ తారక్‌ను కొడుతున్న సీన్ చూసి థియేటర్లో ఓ మహిళ భావోద్వేగానికి గురైంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య తెరకెక్కించారు.
Also Read: Ram Charan: కూల్ కూల్ లుక్‌లో చరణ్.. సిద్దకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆచార్య యూనిట్
Priyanka Mohan: లేలేత గులాబీ సోయగాల సుందరి.. కుర్రకారు మనసులను దోచేస్తోన్న సొగసరి..
Prabhas : క్రేజీ న్యూస్.. ఆదిపురుష్‌లో ప్రభాస్ ఆ అవతారంలో కనిపించనున్నాడట..
RRR Movie: ట్రిపులార్ సక్సెస్‌పై తనదైన స్టైల్లో స్పందించిన రామ్‌గోపాల్ వర్మ.. ఏమన్నరాంటే..