Jailer 2 : సూపర్ స్టార్ సరసన స్టార్ హీరోయిన్.. రజినీకాంత్ సరసన అందాల ముద్దుగుమ్మ

రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. మరోవైపు ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో బాలయ్య బాబు ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు.

Jailer 2 : సూపర్ స్టార్ సరసన స్టార్ హీరోయిన్.. రజినీకాంత్ సరసన అందాల ముద్దుగుమ్మ
Rajinikanth

Updated on: Jun 01, 2025 | 6:43 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్ . సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో రజినీకాంత్ అంత పెద్ద హిట్ అందుకోలేకాదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. జైలర్ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. అలాగే కూలీ సినిమాలోనూ నటిస్తున్నాడు.

కూలీ సినిమాకు లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక జైలర్ 2 సినిమాలో చాలా మంది స్టార్స్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. జైలర్ సినిమాలో బాలకృష్ణ పాత్ర 20 నిముషాలు ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. జైలర్ 1 సినిమాలో రజినీకాంత్ భార్యగా రమ్యకృష్ణ గా నటించారు.

నరసింహ సినిమా తర్వాత రజినీకాంత్, రమ్యకృష్ణ కలిసి జైలర్ సినిమాలో కనిపించారు. ఇక ఇప్పుడు జైలర్ 2 సినిమాలో విద్యాబాలన్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. విద్యాబాలన్ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలోనూ నటించింది. అంతకు ముందు ఆమె నటించిన డర్టీ పిచ్చర్ సినిమా తెలుగులో డబ్ అయ్యింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో విద్య బాలన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.