మ్యాడ్ 2 సినిమాలో స్పెషల్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ.. ఎవ్వరూ ఊహించని హీరోయిన్ ఆమె

|

Mar 22, 2025 | 11:53 AM

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

మ్యాడ్ 2 సినిమాలో స్పెషల్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ.. ఎవ్వరూ ఊహించని హీరోయిన్ ఆమె
Mad 2
Follow us on

2023లో విడుదలైన  “మ్యాడ్” కి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సీక్వెల్ గా “మ్యాడ్ 2”. మొదటి భాగం యువతలో విపరీతమైన ఆదరణ పొంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో “మ్యాడ్ 2″పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. “మ్యాడ్” సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాలేజీ జీవితంలోని హాస్యం, సరదా సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

“మ్యాడ్ 2″లో కథ ముగ్గురు హీరోల ఫ్యామిలీ లైఫ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.. కొత్త హీరోయిన్‌లు ఈ సినిమాలో చేరనున్నారని, శ్రీగౌరి ప్రియా, అనంతిక స్థానంలో మరో ముగ్గురు నాయికలు కనిపించనున్నారని తెలుస్తోంది. మ్యాడ్  సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్‌కు కూడా ఆయనే దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై ఈ చిత్రం నిర్మితమవుతోంది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే “లడ్డూగాని పెళ్లి” అనే పాట విడుదలై మంచి ఆదరణ పొందింది.
అలాగే షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ 2025 ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.”మ్యాడ్ 2″ కూడా యువతను ఆకట్టుకునే కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఫన్ ఎలిమెంట్స్, కొత్త కథతో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు తెలుగమ్మాయి ప్రియాంక జవల్కర్. ఈ ముద్దుగుమ్మ  “టాక్సీవాలా” (2018) వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది. ఆమె గతంలో స్పెషల్ సాంగ్స్‌లో నటించిన రికార్డు లేనప్పటికీ, ఇప్పుడు మొదటిసారి స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే ఈ అమ్మడి పోస్టర్ ను విడుదల చేశారు. ఈ బ్యూటీకి యువతలో మంచి క్రేజ్ ఉంది. దాంతో మ్యాడ్ 2 సినిమాకు మంచి మైలేజ్ వస్తుందని టీమ్ భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..