Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

|

Aug 15, 2024 | 1:17 PM

కింగ్ నాగార్జున మరోసారి బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్నారు. ఇటీవలే సీజన్ 8కి సంబందించిన ప్రోమోలను విడుదల చేశారు. ఈ సారి బిగ్ బాస్‌ను మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎవరు వెళ్తారు అన్నది ఇంతవరకు క్లారిటీ రాలేదు. కానీ రోజుకొక పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. సీజన్ 8లోకి చాలా మంది పాపులర్ పర్సన్స్ వెళ్లనున్నారని తెలుస్తోంది.

Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ
Bigg Boss8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభంకానుంది. సీజన్ 7 మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కింగ్ నాగార్జున మరోసారి బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్నారు. ఇటీవలే సీజన్ 8కి సంబందించిన ప్రోమోలను విడుదల చేశారు. ఈ సారి బిగ్ బాస్‌ను మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎవరు వెళ్తారు అన్నది ఇంతవరకు క్లారిటీ రాలేదు. కానీ రోజుకొక పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. సీజన్ 8లోకి చాలా మంది పాపులర్ పర్సన్స్ వెళ్లనున్నారని తెలుస్తోంది. గత సీజన్ లో రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఎవరు ఊహించని విధంగా విన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్‌లో సెలబ్రెటీలతో పోటీపడి టాస్క్ లు ఆడి విన్నర్ గా నిలిచాడు. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..

అయితే ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సీరియల్ యాక్టర్స్ తో పాటు చాలా మంది హౌస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. వేణుస్వామి, రీతూ చౌదరి, సీరియల్ ఆర్టిస్టులు అంజలి,పాగల్ పవిత్ర, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ,  కమెడియన్ బంచిక్ బబ్లూ, కిరాక్ ఆర్పీ,సీనియర్ నటి సనా, రింగ్ రియాజ్, ఇలా చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

ఇప్పుడు వీరితోపాటు సీరియల్ నటి జ్యోతి రాయ్ పేరు కూడా వినిపిస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడమ్.. అలియాస్ జ్యోతిరాయ్.. చాలా ఫెమస్ ఆమె సీరియల్స్‌లో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది జ్యోతి రాయ్. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది జ్యోతిరాయ్. చిట్టి పొట్టి డ్రెస్ లతో రచ్చ చేసే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో జ్యోతిరాయ్ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది. హీరోయిన్‌గా ఓ సినిమా కూడా చేస్తోంది. అయితే నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి జ్యోతి రాయ్ ఎంట్రీ ఇవ్వనుందా అన్నది.. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. అలాగే కన్నడ బిగ్ బాస్ లోకి కూడా కూడా జ్యోతిరాయ్ కూడా ఎంట్రీ ఇవ్వనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..