Puri Jagannadh: మళ్లీ పట్టాలమీదకు పూరిజగన్నాథ్ జనగణమన ఈ సారి హీరో ఎవరంటే ..

బద్రి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, శివమణి ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ ను షేక్ చేశారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా ఏంహ పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇలా స్టార్ దర్శకుడిగా రాణిస్తున్నారు పూరి రీసెంట్ గా లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నారు.

Puri Jagannadh: మళ్లీ పట్టాలమీదకు పూరిజగన్నాథ్ జనగణమన ఈ సారి హీరో ఎవరంటే ..
Puri Jagannath

Updated on: Sep 03, 2023 | 8:59 AM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు పూరిజగన్నాథ్ బాచి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి బద్రి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, శివమణి ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ ను షేక్ చేశారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా ఏంహ పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇలా స్టార్ దర్శకుడిగా రాణిస్తున్నారు పూరి రీసెంట్ గా లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నారు.

గతంలో ఈ ఇద్దరి కామెబినేషన్ లో ఇస్మార్ శంకర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మారోసారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే లైగర్ తర్వాత జనగణమన అనే సినిమా చేయాలనుకున్నారు పూరి. ఈ సినిమా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో ముందుగా మహేష్ బాబును హీరోగా అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.