Daggubati Venkatesh: వెంకటేష్ సరసన హీరోయిన్ గా పాన్ ఇండియా బ్యూటీ..?

|

Jan 19, 2023 | 9:21 AM

యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ..

Daggubati Venkatesh: వెంకటేష్ సరసన హీరోయిన్ గా పాన్ ఇండియా బ్యూటీ..?
Venkatesh
Follow us on

సీనియర్ హీరోలలో వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ.. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఉండబోతోందనీ తెలుస్తోంది. ఇటీవలే హిట్ 2 సినిమాతో శైలేష్ మంచి హిట్ అందుకున్నాడు. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

గతంలో వెంకటేష్ పోలీస్ గెటప్ లో నటించిన ఘర్షణ సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే తరహా థ్రిల్లర్ నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కేజీఎఫ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ భామ. ఆ తర్వాత విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు వెంకీ సరసన ఈ భామ నటిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.