నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అమిగోస్. డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమాలో డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్. ఇప్పుడు త్రిపాత్రిభినయంలో నటించి అలరించారు. ‘అమిగోస్’ సినిమాను రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా.
బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయి గాని పాటను అమిగోస్‌లో రీమిక్స్ చేశారు. ఈ పాటకి వేటూరి సుందర రామ మూర్తి లిరిక్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ పాటను గతంలో ఇళయరాజా స్వరపరచగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర సంయుక్తంగా ఆలపించారు. సినిమాకు ఈ పాట కూడా వన్ ఆఫ్ ది హైలైట్ అయ్యింది.
కాగా అమిగోస్ మూవీ ఓటీటీ రైట్స్ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందట.. అమిగోస్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.