తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో.. టాప్ హీరోయిన్‌గా నయనతార.. కొనసాగుతోంది. 2004లో ‘చంద్రముఖి’ సినిమాతో.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన.. ఆమె.. దాదాపు 15 సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ నయన్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. కాగా.. ఇప్పుడు నయన్ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ఆమె ‘పెళ్లి’ గురించి.
మొదట శింబు, తర్వాత ప్రభుదేవ, ఇప్పుడు విఘ్నేష్.. ఇదీ నయనతార మీడియాకు పరిచయం చేసిన బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్. పీటల దాకా వస్తోన్న ఆమె పెళ్లిళ్లు… ఎందుకు ఆగిపోతున్నాయి..? ప్రస్తుతం ఇదే ప్రశ్న.. ఆమె ఫ్యాన్స్‌ని తొలిచివేస్తోంది. ఇప్పుడు కూడా విఘ్నేష్‌తో పెళ్లి జరుగుతుందా..? అంటూ అందరిలోనూ ఓ ప్రశ్న మొదలయ్యింది. మొదట శింబు విషయంలో.. ఇలానే జరిగింది. పెళ్లి కన్ఫార్మ్ అయి.. నేడో.. రేపో మూడు ముళ్లు పడతాయి అనుకున్న టైంలో పెళ్లి ఆగిపోయింది.
ఆ తర్వాత.. ప్రముఖ డ్యాన్స్ కొరియాగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన ఆమె.. పెళ్లిపీటల దాకా వెళ్లింది. ప్రభు కోసం.. మతం కూడా మార్చుకుంది నయనతార. ఇక సినిమాలు కూడా చేయను అని కన్ఫార్మ్‌గా చెప్పేసింది. ‘రామరాజ్యం’ సినిమా సమయంలో.. ఇక ఇదే తన ఆఖరు సినిమా అని కంటతడి కూడా పెట్టుకుంది. కానీ.. ఆ తర్వాత ఏమైందో.. ఏమో కానీ.. ఏవో కారణాలతో ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్ విషయంలోనూ అదే రిపీట్ కానుందా..?
సాధారణంగా.. సినీ ప్రముఖుల జీవితాల్లో.. ఇలాంటివన్నీ కామన్‌నే. కానీ.. నయన్ చేసినవన్నీ.. సీరియసే అనిపిస్తూంటాయి. అయితే మరి.. పెళ్లి విషయంలో ఇలా ఎందుకు జరుగుతోంది.? పెళ్లి.. అనే మాట నయన్‌కు అచ్చు రాదా..?
అయితే.. నయనతార జాతకం ప్రకారం.. ఆమెకు పెళ్లి అస్సలు అచ్చు రాదని.. వివాహం జరిగేటట్టుగా కనిపించడం లేదని.. కొందరు జోత్యిష్యులు అంటున్నారు. అలాగే.. ఆమె పెళ్లి చేసుకోకుండా ఉంటే.. జయలలిత మాదిరి.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు వాళ్లు చెబుతున్నారు. అందుకే.. విఘ్నేష్‌తో పెళ్లికి ఆమె వెనకడుగేస్తోందట. కానీ.. విఘ్నేష్ మాత్రం నయన్‌తో పెళ్లికి రెడీ అంటున్నాడు. మరి నయన్.. పెళ్లి కూతురు అవుతుందో.. లేక ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతుందో చూడాలి.