విజయమాల్యా జీవితంపై వెబ్​సిరీస్​

|

Aug 15, 2020 | 7:12 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, లిక్క‌ర్ కింగ్ విజయ మాల్యా లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ వెబ్​సిరీస్ తెర‌కెక్క‌బోతుంది. ​

విజయమాల్యా జీవితంపై వెబ్​సిరీస్​
Follow us on

ప్రముఖ పారిశ్రామికవేత్త, లిక్క‌ర్ కింగ్ విజయ మాల్యా లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ వెబ్​సిరీస్ తెర‌కెక్క‌బోతుంది. ​ ఇందుకు సంబంధించిన క‌థ కోసం నిర్మాణ సంస్థ‌ అల్మైటీ మోషన్​ పిక్చర్స్​ ‘ది విజయ మాల్యా స్టోరీ’ పుస్తక రచయిత​ నుంచి హక్కులను కొనుగోలుచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా తెలిపారు నటి, నిర్మాత ప్రబ్లీన్​ కౌర్​.

‘ది విజయమాల్యా స్టోరీ’ బుక్‌ని ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ కే గిరిప్రకాశ్​ రాయగా.. పెంగ్విన్​ ఇండియా ప్రచురించింది. విజయమాల్యా పుట్టిన‌
దగ్గర నుంచి అతడు యూకే పారిపోయినంత‌వ‌ర‌కు సంబంధించిన వివరాలు ఆ పుస్త‌కంలో ఉన్నాయి​. దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​ ఫైన‌ల్ స్టేజీలో ఉంది. విజయమాల్యా రోల్ పోషించ‌బోయే వ్య‌క్తి కోసం బాలీవుడ్​లో వేట కొన‌సాగుతోంది. వచ్చే నెలలో షూటింగ్​ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది మూవీ యూనిట్. ఈ వెబ్​సిరీస్​ను ఎమ్​ఎక్స్​ ప్లేయర్​లో రిలీజ్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది అల్​మైటీ మోషన్​ పిక్చర్స్ నిర్మాణసంస్థ.