Prabhas Cars: ప్రభాస్ లంబోర్ఘినిని ఎప్పుడైనా చూశారా..? డార్లింగ్ గ్యారేజ్‌లో ఏయే కార్లు ఉన్నాయో తెల్సా..?

|

Feb 04, 2023 | 6:47 PM

ప్రభాస్‌కు కార్లంటే పిచ్చి. మార్కెట్‌లో ఎలాంటి కొత్త కారు వచ్చినా ఆయన టెస్ట్ డ్రైవ్ చేస్తారు. నచ్చితే అదే రోజు తన గ్యారేజ్‌లోకి తెచ్చేస్తారు.

Prabhas Cars: ప్రభాస్ లంబోర్ఘినిని ఎప్పుడైనా చూశారా..? డార్లింగ్ గ్యారేజ్‌లో ఏయే కార్లు ఉన్నాయో తెల్సా..?
Prabahs Cars
Follow us on

పాన్ ఇండియా యాక్టర్ ప్రభాస్ కార్ల కలెక్షన్స్ గురించి అభిమానుల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎన్నో కాస్ట్లీ కార్లు ప్రభాస్ గ్యారేజ్‌లో కొలువుతీరాయి. అందులో ఒకటి.. లంబోర్ఘిని అవెంటడోర్ రోడ్‌స్టర్. తాజాగా దీని గురించి మరోసారి నెట్టింట చర్చ జరుగుతుంది. ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్ డైరెక్టర్ మారుతీ ఇటీవల హైదరాబాద్‌లో ప్రభాస్ లాంబోర్గినీలో ఒక రైడ్ వేశారు. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, “మేము ప్రేమ కోసం ప్రార్థించం, మేము కార్ల కోసం ప్రార్థిస్తాము” అని క్యాప్టన్ పెట్టారు.

వీడియోలో ప్రభాస్‌ను మిస్ అయ్యాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పక్కన సీట్‌లో కూర్చుని వీడియో తీసింది మా డార్లింగేనా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.2021లో ఈ  సొగసైన, సూపర్ లగ్జరీ కార్‌ను కొనుగోలు చేశాడు ప్రభాస్. అప్పుడు దీని ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీని ధర దాదాపు రూ. 6 కోట్లుగా చెబుతున్నారు.

 

ప్రభాస్ గ్యారేజ్‌లో ఇంకా ఏ కార్లు ఉన్నాయి..?

రాయల్ లుక్ ఉండే విలాసవంతమైన కార్లకు ప్రభాస్ విపరీతమైన అభిమాని అని చెబుతుంటారు. 2015లో రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను కొనుగోలు చేసిన ప్రభాస్.. గతంలో ఈ కార్లు కలిగిన అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి నటుల లీగ్‌లో చేరాడు.  హైదరాబాద్ వీధుల్లో ఈ కార్లు నడుపుడూ అప్పుడప్పుడూ కనిపిస్తాడు ప్రభాస్. ఇవే కాకుండా రిట్జీ BMW X3,  జాగ్వార్ XJR కార్లు కూడా ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్నాయి.

సినిమాల విషయానికి వస్తే.. డార్లింగ్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్,  ప్రాజెక్ట్ కె కోసం పనిచేస్తున్నాడు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభాస్ గత సినిమా రాధే శ్యామ్ అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..