
బేబీ! రీసెంట్ సెన్సైనల్ హిట్! కలెక్షన్స్ కూడా రికార్డ్ లెవల్! ఇక దాంతో పాటే.. తాజాగా మొదలయ్యేలా చేసింది ఈ మూవీ డైరెక్టర్ అండ్ హీరో విశ్వక్ సేన్ మధ్య కోల్డ్ వార్! ఎస్ ! కొబ్బరి మట్ట సినిమాతో.. అప్పటికే డైరెక్టర్ కమ్ హీరోగా.. గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్.. తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్‌ను పక్కుకు పెట్టి.. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీగా బేబీ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ ను హీరోగా క్యాస్ట్ చేయాలని అనుకున్నారు. కానీ విశ్వక్ కనీసం స్టోరీ కూడా వినేందుకు ఒప్పుకోలేదని.. తనుకు టైం కూడా ఇవ్వలేదని.. ఆ హీరో అలా చేయడం తనకు అవమానంగా అనిపించిందని.. హీరో పేరు చెప్పకుండానే.. డైరెక్టర్ సాయి రాజేష్ రీసెంట్‌గా కొన్ని కామెంట్స్ చేశారు.
అయితే సాయి రాజేష్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఇప్పటికే ఇండైరెక్ట్‌గా విశ్వక్ రియాక్టైనప్పటికీ… బేబీ సినిమా మిస్ చేసుకున్నారంటూ.. తనపై మీమ్స్ అండ్ న్యూసు రావడం మరింత ఎక్కువ అవడంతో.. తాజాగా ఈ విషయంపై పెదవి విప్పారు ఈహీరో. పేక మేడలు టీజర్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన విశ్వక్.. మునపటిలాగే.. బేబీ సినిమా పేరు ఎత్తకుండా.. ఆ సినిమా డైరెక్టర్‌ను కోట్ చేయకుండా కామెంట్స్ చేశారు. అందర్నీ హ్యాపీ చేయడానికి తానేం బిర్యానీ కాదంటూ.. సెటైరికల్ గా చెప్పారు.