Vijayasai Reddy: సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. చిరంజీవి పై విజయసాయిరెడ్డి ట్వీట్ వార్
రీసెంట్ గా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ ఫంక్షన్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమాను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు.. వీలైతే సహకరించాలి అని అన్నారు మెగాస్టార్. మా సినిమాల గురించి మీరు పార్లమెంట్ లోకూడా మాట్లాడుతున్నారంటే అంతకన్నా దురదృష్టం ఉండదు అని చిరు కామెంట్ చేశారు. మా తిప్పలు మేము పడతాం..
![Vijayasai Reddy: సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. చిరంజీవి పై విజయసాయిరెడ్డి ట్వీట్ వార్](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/chiranjeevi-vijaysai-reddy.jpg?w=1280)
సినిమారంగం ఆకాశం నుంచి ఊడిపడిందా? ఇది మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా విజయసాయి అంటున్న మాటలు, ప్రజలు ఆదరిస్తేనే ఏ రంగానికైనా మనుగడ ఉంటుందని అంటున్నారు విజయ సాయి రెడ్డి. ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకూ ప్రభుత్వాలే రక్షణ.. మీకెందుకు, మాకెందుకు అంటే కుదరదు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు విజయసాయి. ఇంతకు ఆయన మెగాస్టార్ పై ఆ రేంజ్ లో ఎందుకు ట్వీట్స్ తో రెచ్చిపోయారంటే.. రీసెంట్ గా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ ఫంక్షన్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమాను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు.. వీలైతే సహకరించాలి అని అన్నారు మెగాస్టార్. మా సినిమాల గురించి మీరు పార్లమెంట్ లోకూడా మాట్లాడుతున్నారంటే అంతకన్నా దురదృష్టం ఉండదు అని చిరు కామెంట్ చేశారు. మా తిప్పలు మేము పడతాం.. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు చేస్తున్నాం దాని వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది అని అన్నారు చిరంజీవి. సినిమా అనేది రాజకీయాలతో పోల్చుకుంటే చాలా చిన్నది. కాబట్టి సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు అని అన్నారు చిరంజీవి.
చిరంజీవి మాట్లాడిని ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అంటూ కౌంటర్ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిది.. వాళ్ళూ మనుషులే.. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. అందరి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందంటూ కౌంటర్ ఇచ్చారు.
గత నెల 27వ తారీఖున సినీ కార్మికులకు కష్టాలపై రాజ్యసభలో మాట్లాడారు ఎంపీ విజయసాయి రెడ్డి. కార్మికులకు తగిన ఫలితం అందడం లేందంటూ సినిమాటోగ్రాఫ్ బిల్లును లేవనెత్తారు. చలన చిత్ర రంగంలో హీరోలకు చెల్లించే పారితోషకాలు కోట్లలో ఉంటే చిత్ర నిర్మాణం కోసం వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతనాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ పరిస్థితులపై మార్పు తీసుకురావాలని.. సినీ కార్మికులను కష్టానికి తగిన ఫలితం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు విజయసాయిరెడ్డి. దీనికి కౌంటర్‌గా వాల్తేరు వీరయ్య 200 డేస్ పంక్షన్‌లో చిరంజీవి మాట్లాడారు.
కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ….లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..