100 సార్లు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు ఒక్క సినిమాకు 2కోట్లు తీసుకుంటున్న స్టార్ బ్యూటీ ఎవరంటే?

samatha 

13 february 2025

Credit: Instagram

 చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకోవాలి అంటే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నటిగా ఎదగాలంటే ఎన్నోసవాళ్లను దాటుకోవాలి.

 అయితే అలానే ఓ హీరోయిన్ ఎన్నో అవమానాలు ఎదురైనా సరే తన ప్రయత్నం ఆపకుండా, సక్సెస్ కోసం ప్రతిక్షణం ట్రై చేస్తూ చివరకు స్టార్ బ్యూటీగా ఎదిగి ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటుంది.

ఇంతకీ ఆ నటి ఎవరు అనుకుంటున్నారా? ఆమె గురించే ఇప్పుడు మనం వివరంగా  తెలుసుకుందాం.

అందాల ముద్దుగుమ్మ ప్రియా బాపట్ మరాఠా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది..

 మహారాష్ట్రలోని ముంబైలో 1986లో జన్మించిన ఈ అమ్మడు, రుయా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఈ ముద్దుగుమ్మకు చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ ఎక్కువ.

దీంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది.టీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో సెలక్ట్ కావడానికి ముందు ఆమెను వందల సార్లు రిజెక్ట్ చేశారంట.

 అయినా ఎప్పుడూ నిరాశకు గురి కాకుండా, తన సినీ కెరీర్లో సక్సెస్ కాగలిగింది. ఇప్పటికీ ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా,చాలా వాటిల్లో లీడ్ రోల్స్ చేసి మెప్పించింది.

 ఇలా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్క సినిమాకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.