
దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో కీలకపాత్రలో నటించింది ఇంద్రజ శంకర్. ఈ మూవీలో తన నటన.. కామెడీ టైమింగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ ఫుట్ బాల్ టీమ్ లో ఉన్న అమ్మాయిలలో పాండియమ్మ పాత్రలో నవ్వించింది.. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. ఇంద్రజ శంకర్ తమిళ్ నటుడు రోబో శంకర్ కుమార్తె. ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలు. ఇన్నాళ్లు సినిమాల్లో తనదైన కామెడీతో అలరించిన ఇంద్రజ శంకర్ ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 24న తన స్నేహితుడు డైరెక్టర్ కార్తీక్ను వివాహం చేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన వీరి వివాహనికి ఇరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దేవుడి ఆశీస్సుతల్లతో పెద్ద సమక్షంలో మనం ఒక్కటయ్యాం అంటూ పెళ్లి ఫోటోలను నెట్టింట షేర్ చేసింది ఇంద్రజ శంకర్.
ఇంద్రజ, కార్తీక్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. అమ్మా నాన్న కంటే ఎక్కువగా తనకు ఎల్లప్పుడు సపోర్ట్ చేసే వ్యక్తి కార్తీక్ అని.. అతడు మామన్ ట్రస్ట్ కూడా నడుపుతున్నాడని.. అందులో నలభై మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడని తెలిపింది. ముందుగా తనే ప్రపోజ్ చేశానని.. ఆ తర్వాత నాలుగు నెలలకు కార్తీక్ తన ప్రేమను అంగీకరించారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వారంలోనే ఇంట్లో చెప్పి తమ పెళ్లిని ఖాయం చేసుకున్నామని తెలిపింది. 2003 మే 17న ఇంద్రజ పుట్టినరోజు. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు అని తెలియడంతో అభిమానులు షాకవుతున్నారు.
ఇక ఇంద్రజ తండ్రి కూడా నటుడే. రోబో డ్యాన్స్ తో ఫేమస్ కావడంతో అతడిని అంతా రోబో శంకర్ అని పిలుస్తారు. అలాగే మిమిక్రీతో కెరీర్ ప్రారంభించిన ఆ ర్వాత సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశాడు. ఇదుర్కుతనే ఆశైపట్టే బాలకుమార్ సినిమాతో ఫేమస్ అయ్యాడు. ఆ త్రవాత వరుస సినిమాల్లో నటిస్తూ హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.