Laabam Movie : విజయ్ సేతుపతి-శ్రుతిహాసన్ ‘లాభం’ వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ ఫిక్స్..

| Edited By: Ravi Kiran

Aug 29, 2021 | 8:11 AM

విజయ్ సేతుపతి...ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. విభిన్న స్రిప్ట్స్ ఎంచుకుంటూ, విభిన్న రోల్స్ పోషిస్తూ, విభిన్న భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఎపిక్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో.

Laabam Movie : విజయ్ సేతుపతి-శ్రుతిహాసన్ లాభం వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ ఫిక్స్..
Laabham
Follow us on

Laabam Movie : విజయ్ సేతుపతి…ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. విభిన్న స్రిప్ట్స్ ఎంచుకుంటూ, విభిన్న రోల్స్ పోషిస్తూ, విభిన్న భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఎపిక్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో. అస్సలు గ్యాప్ లేకుండా వరసబెట్టి సినిమాలు చేయడంలోనూ ముందే ఉన్నాడు. ప్రస్తుతం తమిళ్, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ దూకుపోతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ నటిస్తూ మెప్పిస్తున్నాడు మక్కల్ సెల్వన్. ఇప్పటికే హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ మెప్పించిన మక్కల్‌ సెల్వన్‌… హోస్ట్‌గానూ అదే స్థాయిలో ఆకట్టుకుంటానంటున్నాడు. ఇంటర్‌నేషనల్ లెవల్‌లో సూపర్ హిట్ అయిన మాస్టర్ చెఫ్ అనే రియాలిటీ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నాడు విజయ్‌ సేతుపతి. ఇదిలా ఉంటే సేతుపతి- శ్రుతిహాసన్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగులో ‘లాభం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ఒకెేసారి తెలుగు-తమిళ్ భాషల్లో విడుదలవుతున్న విజయ్ సేతుపతి ఫస్ట్ సినిమా ఇది. ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ తమిళనాట తన జోరును కొనసాగించాలనే ఉద్దేశంతో శ్రుతిహాసన్ ఉంది. ఇప్పటికే తెలుగులో ఈ బ్యూటీ క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చింది. ఇప్పుడు ఆశలన్నీ లాభం సినిమా పైనే పెట్టుకుంది. ఇక విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే ఉప్పెన సినిమాలో రాయనం అనే నెగిటివ్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోగా లాభం అనే సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ.. మీరు ఒక లుక్ వేయండి..

Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్‌ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి