లైగర్ సినిమాతో నిరాశపరిచిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంగ్ గ్యాప్ తరువాత మరో మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సమంతతో కలసి థియేటర్లలో ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. రౌడీ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా లైగర్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ థియేటర్లలో ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు. విజయ్, సమంత కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఖుషి. సెప్టెంబర 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
ఖుషి కన్నా ముందు విజయ్ నటించిన సినిమా లైగర్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన లైగర్‌కి మినిమమ్ బజ్ కూడా రాకపోవటంతో ఆ ఎఫెక్ట్ విజయ్ నెక్ట్స్ మూవీ మీద కూడా ఉంటుందని భావించారు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే అలా అనిపించటం లేదు.
సినిమా మీద మంచి బజ్ ఉండటంతో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని భావిస్తున్నారు. యావరేజ్ టాక్ వచ్చినా ఖుషీ ఈజీగా సేఫ్ అవుతుంది. అదే సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం రౌడీ భాయ్ మరోసారి వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ఈ సినిమా అటు విజయ్, ఇటు సమంత ఇద్దరు సాలిడ్ హిట్ అందుకుంటారని ఖచ్చితంగా చెప్తున్నారు ఫ్యాన్స్. మరి అభిమానులను ఖుషి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.