Vijay Deverakonda: గీతగోవిందం కాంబో రిపీట్.. విజయ్‌కు జోడీగా ఆమె కావాలంటున్న ఫ్యాన్స్

|

Feb 05, 2023 | 9:02 PM

ఈ క్రమంలోనే ఖుషి అనే చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Vijay Deverakonda: గీతగోవిందం కాంబో రిపీట్.. విజయ్‌కు జోడీగా ఆమె కావాలంటున్న ఫ్యాన్స్
Vijay Devarakonda
Follow us on

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా సాలిడ్ సక్సెస్ అందుకోవాలని కసి మీద ఉన్నాడు విజయ్. ఈ క్రమంలోనే ఖుషి అనే చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. కాగా సమంత అనారోగ్యానికి గురవ్వడంతో ఈ మూవీ షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది. త్వరలోనే ఈ సినిమా తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే విజయ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సినిమాలో గీతగోవింద ఒకటి. ఈ  సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు.

అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. గీతగోవిందం సినిమా తర్వాత పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు పరశురామ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.

గీతగోవిందం సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మరోసారి రష్మికనే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. ఫ్యాన్స్ కూడా రష్మిక ను తీసుకోవాలని కోరుకుంటున్నారు. విజయ్ , రష్మిక కెమిస్ట్రీ బాగుంటుందని.. ఆన్ స్క్రీన్ మీద ఇద్దరు సూపర్ గా ఉంటారని అంటున్నారు ఫ్యాన్స్. ఇక విజయ్ తో రష్మిక గీటీజగోవిందం సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది. మరి మరోసారి పరశురామ్ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తుందేమో చూడాలి.