Vijay Devarakonda- Samantha : సమంత -విజయ్ దేవరకొండ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vijay Devarakonda- Samantha : సమంత -విజయ్ దేవరకొండ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే
Vijay Samantha

Updated on: Apr 18, 2022 | 8:54 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆసినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడ. దాంతో విజయ్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేయడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రెండు సినిమాలను అనౌన్స్ చేశారు విజయ్. ఇప్పటికే లైగర్ సినిమాను కంప్లీట్ చేసి .. సెకండ్ ప్రాజెక్ట్ జనగణమన ను పట్టాలెక్కించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాతో విజయ్ అలరించడానికి రెడీ అవుతున్నాడు. చాలా కాలంగా విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

గతంలో ఈ ఇద్దరు కలిసి మహానటి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందనే టాక్ వినిపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. అలాగే ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును స్టార్ట్ చేయనున్నారట. ఫస్టు షెడ్యూల్ ను కశ్మీర్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. గతంలో శివ నిర్వాణ తెరకెక్కించిన ప్రేమ కథలు  అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా కూడా తప్పకుండ ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్. మరి ఈ సారి శివ విజయ్, సమంతలతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Also Read: Acharya: భలే భలే బంజారా సాంగ్ వచ్చేసింది.. చిరంజీవి, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదుర్స్..

Nikhil: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెసిన యంగ్ హీరో.. నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?..

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..

Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..