
మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్ (Liger). రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన లైగర్ ట్రైలర్‌కు అధ్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ, రమ్యకృష్ణ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు విజయ్ యాటీట్యూడ్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు నిర్మాత ఛార్మి ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు.
లైగర్ చిత్రం నుంచి విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ తెలిపే గ్లింప్స్ టీజర్‌ను జూలై 29న ఉదయం 9 గంటలకు విడదల చేయబోతున్నారు. #WaatLagaDenge అనే హాష్ ట్యాగ్ తో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన అక్డీ పక్టీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై ఛార్మి, పూరీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇందులో బాక్సర్‌గా విజయ్ కనిపించనుండగా.. కథానాయికగా అనన్య పాండే నటిస్తోంది.
ట్వీట్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.