
ఎన్నో వందల సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు రమాప్రభ. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారామె. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ‘చిలకా గోరింకా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రమాప్రభ. ఈ సినిమాలో శశి పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. దీంతో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన Dr.ఆనంద్ సినిమాలో కూడా రమా ప్రభకు
మంచి రోల్ వచ్చింది. దీని తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేశారీ అందాల తార. అలాగేకమెడియన్ గా, సహాయక నటిగానూ మెప్పించారు. ఏఎన్నార్, కృష్ణం రాజు, కృష్ణ, శోభన్ బాబు వంటి అలనాటి హీరోలతో పాటు వెంకేటష్, నాగార్జున, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఇలా నేటి తరం హీరోలతోనూ యాక్ట్ చేశారు రమాప్రభ. బద్రి, స్నేహమంటే ఇదేరా, ఫ్యామిలీ సర్కస్, స్నేహమంటే ఇదేరా, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్, హ్యాపీ, దేవదాసు, దేశముదురు తదితర సినిమాల్లో సహాయక నటిగా మెప్పించారు రమాప్రభ. ఇదిలా ఉంటే సినిమా కెరీర్ సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఎదురుదెబ్బలు తిన్నారీ సీనియర్ నటి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం 79 ఏళ్ల వయసున్న రమాప్రభ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే వార్తల్లో కనిపిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన రమా ప్రభ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘ సినిమాల్లో నటించడం ద్వారా నేను బాగానే డబ్బు సంపాదించాను. కానీ ఒక నటుడు నన్ను దారుణంగా మోసం చేశాను. అతని కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను. అతనిని నమ్మిన పాపానికి చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రోడ్డున పడ్డాను. అలా దిక్కుతోచని సమయంలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను సాయం అడుగుదామని వెళ్లాను. ఆయన నాకు దారి ఖర్చులు ఇస్తే చాలు అనుకోని సాయం చేయమని అడిగాను.. కానీ ఆయన వెంటనే నాకు 40వేల రూపాయిలు చేతిలో పెట్టారు. అప్పట్లో 40వేలంటే మాటలు కాదు. అడిగిన వారికి లేదనుకుండా సహాయం చేసే మంచి వ్యక్తిత్వం ఉన్న గొప్ప మనిషి రజినీకాంత్. ఆయన చేసిన సహాయం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చారు రమా ప్రభ. అయితే తనను మోసం చేసిన నటుడి పేరు మాత్రం వెల్లడించలేదీ సీనియర్ నటి.
సినిమాల సంగతి పక్కన పెడితే.రమాప్రభ.. ఒకప్పటి స్టార్ హీరో శరత్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. వీరిద్దరు ఎక్కువ కాలం కలిసుండలేకపోయారు. పెళ్లైన 14 ఏళ్లకు ఇద్దరి మధ్య బేధాప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.