Bollywood : బాలీవుడ్ ఖాన్‌దాన్ మీద సౌత్ నజర్‌.. మంచి హైప్‌ క్రియేట్ చేస్తోన్న హిందీ సినిమాలు

|

Feb 01, 2023 | 9:18 AM

ఆల్రెడీ మెగా సపోర్ట్‌తో సౌత్ ఆడియన్స్‌ను పలకరించిన సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ 3 సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

Bollywood : బాలీవుడ్ ఖాన్‌దాన్ మీద సౌత్ నజర్‌.. మంచి హైప్‌ క్రియేట్ చేస్తోన్న హిందీ సినిమాలు
Bollywood
Follow us on

బాలీవుడ్ ఖాన్‌దాన్ నుంచి వస్తున్న సినిమాల మీద సౌత్ నజర్‌ కూడా సీరియస్‌గానే కనిపిస్తోంది. ఆల్రెడీ మెగా సపోర్ట్‌తో సౌత్ ఆడియన్స్‌ను పలకరించిన సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ 3 సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. టైగర్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలు సూపర్ హిట్ కావటంతో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ కోసం ఆడియన్స్‌ వెయిటింగ్‌లో ఉన్నారు. బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్‌ బ్రహ్మాస్త్ర. రణబీర్‌, అలియా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా సౌత్‌లోనూ సూపర్ హిట్ అయ్యింది. దీంతో బ్రహ్మస్త్ర సీక్వెల్ మీద సౌత్ ఆడియన్స్‌లోనూ మంచి హైప్‌ క్రియేట్ అవుతోంది.

తాజాగా కింగ్ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్ కూడా సౌత్ మీద గట్టిగానే ఫోకస్‌ చేశారు. లాంగ్ గ్యాప్‌ తరువాత చేసిన పఠాన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా రిలీజ్ చేశారు. తరువాత సౌత్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో జవాన్‌ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సౌత్ ఆడియన్స్‌ మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లోనూ టాప్‌లోనే ఉన్నాయి. ఇప్పటికే పఠాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో జవాన్ సినిమా పై అంచనాలు రెట్టింపయ్యాయి.

సౌత్‌తో పెద్దగా సంబంధం లేకపోయినా.. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలను మన ఆడియన్స్ ఎప్పుడూ వెల్‌కం చేస్తున్నారు. అందుకే హృతిక్ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్‌, అక్షయ్‌, టైగర్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న బడే మియా చోటే మియా సినిమాల విషయంలో కూడా సౌత్‌ సర్కిల్స్‌లో మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది. ఇలా బాలీవుడ్ సినిమాలను కూడా మనవాళ్ళు ఆదరిస్తున్నారు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.