Ram Charan Upasana : రామ్ చరణ్ మాస్ ఎంట్రీ.. విజిల్ వేసి పేపర్లు విసిరేసిన ఉపాసన.. వీడియో వైరల్..

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'పెద్ది'. జూన్ 4న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవ్వడంతో మెగా ఫ్యామిలీలో, అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల థియేటర్ లో పెద్ది సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Ram Charan Upasana : రామ్ చరణ్ మాస్ ఎంట్రీ.. విజిల్ వేసి పేపర్లు విసిరేసిన ఉపాసన.. వీడియో వైరల్..
Upasana Reaction

Updated on: Jun 04, 2026 | 7:05 AM

ఎట్టకేలకు పెద్ది సినిమా అడియన్స్ ముందుకు వచ్చేసింది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ సినిమాకు దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు టేకింగ్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. చరణ్ ఊరమాస్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ పడగా.. ఇప్పుడు ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది. సినిమా విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో ‘పెద్ది’ మేనియా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫ్యాన్స్ రియాక్షన్స్, సెలబ్రెటీస్ సందడి తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ భార్య ఉపాసన సైతం పెద్ది థియేటర్ల్ లో సందడి చేసింది.

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

సినిమా చూసిన ప్రేక్షకులు, ముఖ్యంగా మెగా అభిమానులు థియేటర్ల వెలుపల భారీ కటౌట్లకు పాలాభిషేకం చేస్తూ, బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్‌చరణ్ నటన, బుచ్చిబాబు సన మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లు, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం పెద్ది ప్రీమియర్స్ నేపథ్యంలో హైదరాబాద్ బాలానగర్ లో పెద్ది స్పెషల్ స్క్రీనింగ్ కు కుటుంబంతో కలిసి వచ్చారు ఉపాసన. అభిమానులతో కలిసి చరణ్ సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

ముఖ్యంగా రామ్ చరణ్ ఊర మాస్ ఎంట్రీ.. యాక్షన్ సీక్వెన్స్ సమయంలో ఉపానస సైతం ఫ్యాన్స్ మాదిరిగానే తెగ ఎంజాయ్ చేశారు. అభిమానులతో కలిసి కేకలు వేస్తూ.. పేపర్లు విసిరేస్తూ.. విజిల్స్ వేస్తూ ఫుల్ జోష్ లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. దీంతో ఉపాసన రియాక్షన్ చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఉపాసన ఇలా థియేటర్‌లో సామాన్య ప్రేక్షకులతో కలిసి ఎంజాయ్ చేయడం రామ్‌చరణ్ పట్ల ఆమెకున్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. “రామ్‌చరణ్‌కు దొరికిన అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్ ఉపాసన” అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఉపానస రియాక్షన్..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us