Udaya Bhanu: ఇన్నాళ్ల తరవాత ఇలా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు ఉదయభాను..

ఉదయభాను.. ఈ అందాల యాంకర్‌ను అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకప్పుడు తన మాటలతో.. అందంతో, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించింది ఉదయభాను.

Udaya Bhanu: ఇన్నాళ్ల తరవాత ఇలా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు ఉదయభాను..
Udaya Bhanu

Updated on: Nov 11, 2024 | 8:54 AM

సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు యాంకర్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరమీద రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. అలాగే అనసూయ, రష్మీ ఇలా ఇంకొంతమంది కూడా ఉన్నారు. అయితే బుల్లితెర అతిలోక సుందరి పేరుతెచ్చుకున్న యాంకర్ గుర్తుందా.? ఆమె ఎవరో కాదు.. ఉదయభాను. ఈ అందాల యాంకర్‌ను అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకప్పుడు తన మాటలతో.. అందంతో, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించింది ఉదయభాను. యాంకర్‌గా చేసిన మొదటి కార్యక్రమంతోనే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది ఉదయభాను.

ఇక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆతర్వాత చాలా కార్యక్రమాలకు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా , డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా పాపులర్ షోల్లో యాంకర్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది ఉదయభాను. 10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది ఉదయభాను.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలో నటించింది ఉదయభాను. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది ఈ చిన్నది. ఇక పెళ్లి తర్వాత ఉదయభాను బుల్లితెర పై కనిపించలేదు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది ఉదయభాను. ‘త్రిబాణధారి బార్బరిక్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు ఉదయభాను. ఈ సినిమాలో వాకిలి పద్మ అనే పాత్రలో నటిస్తుంది ఉదయభాను. ఈ సినిమాను ఉదయభాను లుక్ ను కూడా రిలీజ్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత వాకిలి పద్మ అనే మంచి పాత్రలో ఉదయ భాను నటించారని దర్శకుడు అన్నారు. మరి ఈ సినిమా తర్వాత ఉదయభాను తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూడలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.