Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాపై అన్నామలై రివ్యూ.. సెన్సార్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించి టాక్సిక్ సినిమా ఆగస్టు 26 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో రిలీజైన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాకు నెగెటివ్ టాక్ వస్తోంది. దీనికి తోడు సినిమాలో మితిమీరిన హింస , బోల్డ్ సీన్స్ ఉన్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Toxic Movie: యశ్ టాక్సిక్ సినిమాపై అన్నామలై రివ్యూ.. సెన్సార్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం
Toxic Movie, K Annamalai

Updated on: Aug 29, 2026 | 6:30 AM

యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం నేపథ్యంలో కె. అన్నామలై సెన్సార్ బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వి ది లీడర్స్’ వ్యవస్థాపకుడు . సినిమాలలో మితిమీరిన హింసను, స్త్రీ ద్వేషపూరిత అంశాలను అరికట్టడంలో CBFC విఫలమైందని ఆయన ఆరోపించారు. పెద్ద స్టార్ల సినిమాలకు కూడా కఠినమైన సెన్సార్ నిబంధనలు వర్తింపజేయాలని అన్నామలై డిమాండ్ చేశారు. నటుడు యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన అన్నామలై.. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో కఠినమైన సెన్సార్‌షిప్ కొరవడిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సినిమాల్లో తీవ్రమైన హింసా దృశ్యాలను, మహిళలను కించపరిచే సన్నివేశాలను యథేచ్ఛగా చూపిస్తున్నారు. నేను ఏ సినిమాపైనా నిషేధం విధించాలని కోరడం లేదు. కానీ సినిమా ఎంత పెద్దదైనా సరే, సెన్సార్ బోర్డు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు మైనర్లను థియేటర్లలోకి అనుమతించకూడదు. సింగిల్-స్క్రీన్ థియేటర్ల యజమానులు ఈ నియమాలను కఠినంగా అమలు చేయడం లేదు. తెరపై మితిమీరిన హింస, పురుషాధిక్య సంస్కృతి యువతరాన్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. “‘టాక్సిక్’ వంటి టైటిల్స్‌తో సినిమాల్లో మహిళలను ఎలా చిత్రీకరి స్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటి సినిమాలు తొలిరోజే వందల కోట్ల రూపాయలు వసూలు చేశాయి. మన పిల్లలు, విద్యార్థులు ప్రతిరోజూ వాటిని చూసేందుకు అనుమతిస్తే, ఈ దేశంలో మహిళల భద్రత ఎక్కడికి చేరుకుంటుంది?’

‘మహిళల రక్షణ, భద్రతపై అవగాహన కల్పించేందుకు మేము ప్రతి ఊరికీ, కళాశాలకూ వెళ్తుండగా, సినిమాల్లో చూపిస్తున్న ఇలాంటి విషయాలు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతున్నాయి. ఈ విషయంలో భారతీయ సినిమా పరిశ్రమ దృష్టి మారాల్సిన అవసరం ఉంది. సమాజంపై సినిమా ప్రభావం అపారమైనది. అందువల్ల, రాబోయే తరానికి మంచి వినోదం అందేలా తగిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నామలై సెన్సార్ బోర్డును కోరారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

టాక్సిక్ గురించి అన్నామలై మాటల్లో..

ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. . నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

టాక్సిక్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us