Director Sagar: ఇండస్ట్రీలో మరో విషాదం.. డైరెక్టర్ సాగర్ కన్నుమూత..

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అమ్మదొంగ, జగదేగ వీరుడు సినిమాలను తెరకెక్కించారు. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు సాగర్. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు.

Director Sagar: ఇండస్ట్రీలో మరో విషాదం.. డైరెక్టర్ సాగర్ కన్నుమూత..
Director Sagar

Updated on: Feb 02, 2023 | 9:12 AM

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటి జమున మృతిని మరువక ముందే చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. చెనైలోని తన నివాసంలో ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అమ్మదొంగ, జగదేగ వీరుడు సినిమాలను తెరకెక్కించారు. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు సాగర్. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు.

చారుశీల సినిమాతో నిర్మాతగానూ మారారు సాగర్‌. వివి వినాయక్‌, శ్రీనువైట్ల లాంటి స్టార్ డైరెక్టర్లు ఈయన శిష్యులే. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న సాగర్‌.. అనారోగ్యంతో కన్నుమూసినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us