టాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వీరిలో ఈషా రెబ్బ ఒకరు. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈషా రెబ్బ. అలాగే తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక మొన్నామధ్య 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ తన గ్లామర్ తో నెటిజన్స్ మతిపోగొడుతోంది ఈషా.. తాజాగా చీరకట్టులో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.