Tollywood : అందానికి కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మలు.. నెట్టింట నటీమణుల రచ్చ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లితరవాత వరుస సినిమాల్లో నటిస్తుంది కాజల్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది కాజల్. అలాగే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2లోనూ హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా కాజల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Tollywood : అందానికి కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మలు.. నెట్టింట నటీమణుల రచ్చ
Tollywood

Updated on: Sep 27, 2023 | 9:00 AM

కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించి మెప్పించింది. సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి వరుస సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె తర్వాత విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ అమ్మడికి సినిమా ఛాన్సులు తగ్గాయి. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా శ్రీనిధి శెట్టి తన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.