Suhas: సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..? ఆ వింత చేష్టాలేంటి..?

|

Apr 16, 2024 | 10:32 AM

ముందుగా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సుహాస్ ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. 2018లో విడుదలైన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు సుహాస్. కలర్ ఫోటో సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అద్భుతంగా నటించి శబాష్ అనిపించుకున్నాడు సుహాస్.

Suhas: సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..? ఆ వింత చేష్టాలేంటి..?
Suhaas
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ లో టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు సుహాస్. ఇండస్ట్రీకి చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు. ఇప్పుడు రాణిస్తున్న చాందిని చౌదరి, రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవల్కర్ ఇలా చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారే సుహాస్ కూడా లాంటి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ముందుగా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సుహాస్ ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. 2018లో విడుదలైన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు సుహాస్. కలర్ ఫోటో సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అద్భుతంగా నటించి శబాష్ అనిపించుకున్నాడు సుహాస్. అంతే కాదు ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సుహాస్. అలాగే ఫ్యామిలీ డ్రామా అనే సినిమాలో సైకో పాత్రలో నటించాడు. అలాగే హిట్ 2: ద సెకెండ్ కేస్ సినిమాలో విలన్ గా నటించాడు. ఇక రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో మరోసారి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు సుహాస్. ఇప్పుడు శ్రీ‌రంగ‌నీతులు, కేబుల్ రెడ్డి, ప్రసన్న వదనం, గొర్రె పురాణం అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇదిలా ఉంటే సుహాస్ కు సబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాల్లోకి రాకముందు సుహాస్ చేసిన ఈవీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈవీడియో తోనే సుహాస్ కు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయని అంటున్నారు. ఈ వైరల్ వీడియోలో సుహాస్.. బాహుబలి సినిమాలోని కిలికిలి బాషా మాట్లాడుతూ చిత్ర విచిత్ర ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ కనిపించాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అన్న ఏమైందన్న నీకు.. అలా చేస్తున్నావ్ అంటూ ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.