
‘మన శంకరవరప్రసాద్ గారు’ తో మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. ఏకంగా రూ. 400 కోట్ల మేర కలెక్షన్లు సాధించి రీజినల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ప్రస్తుతం ఈ సక్సెజ్ జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ ఓ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో దర్శకుడిగా సత్తా చాడు అభిషన్ జీవింత్. ఇప్పుడు ‘విత్ లవ్’ మూవీతో హీరోగా మారాడు. ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 6న విడుదలయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాను అనిల్ రావిపూడి చూశాడు. అనంతరం సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు.
‘విత్ లవ్’ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. ఇటీవలి కాలంలో వచ్చిన ఆహ్లాదకరమైన సినిమా ఇది. ముఖ్యంగా తెలుగు డైలాగులు సందర్భోచితంగా, చాలా నీట్‌గా ఉన్నాయి. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. షాన్ రోల్డన్ సంగీతం సినిమాకు చాలా చక్కగా కుదిరింది. తొలి సినిమాకే ఇంతమంచి ప్రతిభ చూపించిన దర్శకుడు మధన్‌ను మెచ్చుకుని తీరాల్సిందే! సోదరా.. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్యూట్ మూవీ నిర్మించిన సౌందర్య రజనీకాంత్, మగేశ్‌కు అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన రానా దగ్గుబాటికి ప్రత్యేక అభినందనలు’ అని ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Truly enjoyed watching #WithLove 🩶
A breezy, well-made rom-com in recent times with very apt and neatly penned Telugu dialogues.@Abishanjeevinth & #AnaswaraRajan feels spot on, and @RSeanRoldan’s music works beautifully.
Kudos to @madhann_n on a fantastic debut. Long way to…
— Anil Ravipudi (@AnilRavipudi) February 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.