మన దర్శక రచయిత టాలెంట్ .. ఎల్లలు లేకుండా దూసుకుపోతుంది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలతో దుమ్ములేపుతున్నా మేకర్స్. గతంలో తెలుగు సినిమాలు అనేవి ఒకటి ఉంటాయి అని కూడా గుర్తించనవారు.. ఇప్పుడు మన సినిమాల రివ్యూలు ఇస్తూ పొట్ట నింపుకుంటున్నారు. అసలు వీరిస్తున్న కొన్ని రివ్యూలు చూస్తుంటే వీళ్లు సినిమాలు చూస్తున్నారా అనే డౌట్ రాక మానదు. విచిత్రంగా ఒక్కోసారి సినిమాలు రిలీజ్ కాకముందే విశ్లేషణను ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. నేమ్ అండ్ ఫేమ్ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఉమైర్ సంధు అనే వ్యక్తి ఈ మధ్య కాస్త ఎక్కువ చేస్తున్నాడు. మన హీరోల ఫ్యాన్స్‌కు కావాలని ఆగ్రహం తెప్పిస్తున్నాడు.
ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా.. రివ్యూవర్‌గా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనను తాను కోట్ చేసుకునే ఉమైర్ సంధు.. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలపైనే.. అందులోనూ టాలీవుడ్ టాప్ స్టార్ సినిమాల పైనే పడ్డారు. ఓ సినిమా… రిలీజ్ కు రెడీ అవ్వడమే ఆలస్యం.. ‘జెస్ట్ నవ్ సినిమా చూశాను.. ఇట్స్ డిజాస్టర్ ఫిల్మ్ .. ఇట్స్ యావరేజ్ ఫిల్మ్’ అంటూ సోషల్ మీడియాలో షార్ట్ రివ్యూలు.. ఫ్రాడ్ రివ్యూలివ్వడానికి ఆరాటపడుతున్నాడు.
రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన మెగాస్టార్ చిరూ వాల్తేరు వీరయ్య విషయంలోనే ఇదే చేశారు. సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందే సినిమా చూశానంటూ.. సినిమా రొటీన్గా వరెస్ట్ గా ఉందంటూ ట్వీట్ చేశారు. బాలయ్య వీరసింహా రెడ్డి విషయంలోనూ ఇలాగే ట్వీట్ చేశారు. ఇలా తన ట్వీట్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాననే ఉమైర్ అనుకుంటున్నారు కానీ.. మన టాలీవుడ్ ఫిల్మ్ లవర్స్ ను హర్ట్ చేస్తున్నారని మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాడు. అంతేకాదు మొన్నీమధ్య ప్రభాస్, కృతి సనమ్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని ట్వీట్ వేశాడు. దీంతో ఫ్యాన్స్ ఉమైర్ సంధును నెట్టింట గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అతడికి కావాల్సింది కూడా ఇదేలేండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.